Telugu Lyrics
అనుకరించెద – నే – ననుదినమును బాలుం డేసు = ననువుగాను జ్ఞానమునం
– దును వయస్సునందును దే – వుని ప్రేమను మానవుల ద – యను బెరిగిన
బాలుండేసు ||ననుకరించెద||
1. పరదేశంబున వసించి – పరమాత్తుని మదిం దలంచి = దురితమును
జయించిన స – చ్చరింతుండైన యోసేపు ||ననుకరించెద||
2. తల్లి యానతి నెరవేర్చి – తమ్ముని కష్టములం దీర్చి = యెల్లకాలముండు కీర్తి
– నిల గడించిన మిర్యాము ||ననుకరించెద||
3. పాలు మరచినది మొదలు – ప్రభు సేవా సంపదలు = ఆలయమునం
బూనిన సు – బాలకుండు సమూయేలు ||ననుకరించెద||
4. శత్రువులను బరిమార్చి – మిత్రులకు జయంబొనర్చి = స్తోత్రగీతములు
రచించిన – సుందరుండౌ దావీదు ||ననుకరించెద||
5. పరులకు న్యాయంబుం దీర్చం – బ్రజలకు క్షేమంబుం గూర్చం = పరమ
వివేకంబుం గోరి – ప్రభు నడిగిన సొలొమోను ||ననుకరించెద||
6. యజమానుని కుష్టుం గాంచి – స్వజనుల దేవుని గురించి = నిజ సాక్ష్య
మిడి సన్మా – నించిన హెబ్రీయ బాల ||ననుకరించెద||
7. అపవిత్ర రాజ భోజ – నాదుల విడి దైవ పూజం = గపట మింత లేక చేసి
– ఘనత నొందిన దానియేలు ||ననుకరించెద||
8. ప్రార్థన కూటమునం జేరి – ప్రత్యుత్తర మపుడె కోరి = సార్థకముగం బేతురుని
– సమాచార మిడిన రొదే ||ననుకరించెద||
9. భక్తిభయములందుం బెరిగి – బహు ప్రదేశములను దిరిగి = శక్తి కొలంది
సంఘ పరి – చర్య నొనర్చిన తిమోతి ||ననుకరించెద||
English Lyrics / Transliteration
Anukarincheda – Ne – Nanudinamunu Baalun Desu = Nanuvugaanu Jnyaanamunan
– Dunu Vayassunandunu De – Vuni Premanu Maanavula Da – Yanu Berigina
Baalundesu ||Nanukarincheda||
1. Paradeshambuna Vasinchi – Paramaaththuni Madin Dalanchi = Durithamunu
Jayinchina Sa – Chcharinthundaina Yosepu ||Nanukarincheda||
2. Thalli Yaanathi Neraverchi – Thammuni Kashtamulan Deerchi = Yellakaalamundu Keerthi
– Nila Gadinchina Miryaamu ||Nanukarincheda||
3. Paalu Marachinadi Modalu – Prabhu Sevaa Sampadalu = Aalayamunan
Boonina Su – Baalakundu Samooyelu ||Nanukarincheda||
4. Shathruvulanu Barimaarchi – Mithrulaku Jayambonarchi = Sthothrageethamulu
Rachinchina – Sundarundau Daaveedu ||Nanukarincheda||
5. Parulaku Nyaayambun Deerchan – Brajalaku Kshemambun Goorchan = Parama
Vivekambun Gori – Prabhu Nadigina Solomonu ||Nanukarincheda||
6. Yajamaanuni Kushtun Gaanchi – Svajanula Devuni Gurinchi = Nija Saakshya
Midi Sanmaa – Ninchina Hebreeya Baala ||Nanukarincheda||
7. Apavithra Raaja Bhoja – Naadula Vidi Daiva Poojan = Gapata Mintha Leka Chesi
– Ghanatha Nondina Daaniyelu ||Nanukarincheda||
8. Praarthana Kootamunan Jeri – Prathyuththara Mapude Kori = Saarthakamugam Bethuruni
– Samaachaara Midina Rode ||Nanukarincheda||
9. Bhakthibhayamulandun Berigi – Bahu Pradeshamulanu Dirigi = Shakthi Kolandi
Sanggha Pari – Charya Nonarchina Thimothi ||Nanukarincheda||
Song History & Meaning
Composer / Hymnodist: Traditional / Worship Minstrels
This hymn invites us to look at Jesus, who grew in wisdom, stature, and favor with God and people, and to make Him our daily model. Just as faithful witnesses like Joseph, Miriam, and Samuel served God with obedience, we are called to imitate Christ's love and righteousness. As you sing this song, let it be your heart's desire to reflect His grace and light in every situation you encounter today.
📖 Related Scripture Passages:
- Luke 2:52: “And Jesus increased in wisdom and stature, and in favor with God and men.”
- Ephesians 5:1: “Be therefore imitators of God, as beloved children.”
- John 13:15: “For I have given you an example, that you should also do as I have done to you.”