అన్యజనులేల – Anya Janulela Song Lyrics in Telugu & English | Chords & Meaning

Telugu Lyrics

అన్యజనులేల లేచి
గల్లత్తు చేయు-చున్నారు – అన్యజనులేల
జనములేల వ్యర్థమైన
దాని తలంచుచున్నవి (2) ||అన్యజనులేల||

భూలోక రాజులు లేచి
వారేకముగా ఆలోచించి – భూలోక రాజులు
వారి పాశములను తెంపి
పారవేయుద మనుచున్నారు (2) ||అన్యజనులేల||

ఆకాశ వాసుండు వారిని
అపహసించుచున్నాడు నవ్వి – ఆకాశ వాసుండు
వారలతో పల్కి కోపముతో
వారిని తల్లడిల్ల చేయును (2) ||అన్యజనులేల||

పరిశుద్ధమైన నాదు
పర్వతమగు సీయోను మీద – పరిశుద్ధమైన
నారాజు నాసీనునిగా జేసి
యున్నానని సెలవిచ్చెను (2) ||అన్యజనులేల||

కట్టడ వివరింతు నాకు
యిట్లు చెప్పెను యెహోవాయందు – కట్టడ వివరింతు
నీవు నా కుమారుడవు
నిన్ను నేను కనియున్నాను (2) ||అన్యజనులేల||

నన్ను అడుగుము నీకు
జనముల భూమిని స్వాస్థ్యముగా – నన్ను అడుగుము
దిగంతముల వరకు
స్వాస్థ్యముగా నొసంగెదను నీకు (2) ||అన్యజనులేల||

ఇనుప దండముతో నీవు
వారిని నలుగగొట్టెదవు – ఇనుప దండముతో
కుండను పగులగొట్టునట్లు
వారిని పగులగొట్టెదవు (2) ||అన్యజనులేల||

ఓ రాజులారా మీరు
జ్ఞానవంతులై యుండుడి – ఓ రాజులారా
ఓ భూపతులారా మీరు
నాభోద నొందుడి నేడే (2) ||అన్యజనులేల||


English Lyrics / Transliteration

Anya Janulela Lechi
Gallatthu Cheyu-chunnaaru – Anya Janulela
Janamulela Vyardhamaina Daani Thalanchuchunnavu – (2)

Bhoo Loka Raajulu Lechi
Vaarekamugaa Aalochinchi – Bhoo Loka Raajulu
Vaari Paashamulanu Thempi
Paaraveyuda Manuchunnaaru (2) ||Anya Janulela||

Aakaasha Vaasundu Vaarini
Apahasinchuchunnaadu Navvi – Aakaasha Vaasundu
Vaaralatho Palki Kopamutho
Vaarini Thalladilla Cheyunu (2) ||Anya Janulela||

Parishuddhamaina Naadu
Parvathamagu Seeyonu Meeda – Parishuddhamaina
Naaraaju Naaseenunigaa Jesi
Yunnaanani Selavichchenu (2) ||Anya Janulela||

Kattada Vivarinthu Naaku
Yitlu Cheppenu Yehovaa Yandu – Kattada Vivarinthu
Neevu Naa Kumaarudavu
Ninnu Nenu Kaniyunnaanu (2) ||Anya Janulela||

Nannu Adugumu Neeku
Janamula Bhoomini Swaasthyamugaa – Nannu Adugumu
Diganthamula Varaku
Swaasthyamugaa Nosangedanu Neeku (2) ||Anya Janulela||

Inupa Dandamutho Neevu
Vaarini Nalugagottedavu – Inupa Dandamutho
Kundanu Pagulagottunatlu
Vaarini Pagulagottedavu (2) ||Anya Janulela||

O Raajulaaraa Meeru
Gnaanavanthulai Yundudi – O Raajulaaraa
O Bhoopathulaaraa Meeru
Naabodha Nondudi Nede (2) ||Anya Janulela||


Watch & Listen


Song History & Meaning

Composer / Hymnodist: Traditional / Worship Minstrels

In a world filled with turmoil and opposition, it can often feel like chaos is taking over. Yet, as Psalm 2 reminds us, our God remains peacefully enthroned in heaven, holding all authority in His hands. This song invites us to shift our gaze from the raging noise of the world to the quiet confidence of His supreme rule. No matter what opposition arises, we can rest securely knowing that God’s sovereign love and purpose for us will never fail.

📖 Related Scripture Passages:

  • Psalm 2:1: “Why do the nations conspire and the peoples plot in vain?”
  • Psalm 2:2: “The kings of the earth rise up and the rulers band together against the Lord and against his anointed, saying,”
  • Psalm 2:3: ““Let us break their chains and throw off their shackles.””

⭐ Verified Preferred Worship Source


Leave a Reply