Telugu Lyrics
పల్లవి:
దేవా! నీ తలంపులు నా – కెంతో ప్రియము ఎంతో ప్రియము (2)
వాటిమొత్తము దాసుడనగునే – నెంచి చెప్పెద గొప్పది గొప్పది (2)
1. పాతాళపు పాశములు – నన్ను అరికట్టగా (2)
ఆవరించె మరణ ఉరులు (2) – క్రుంగిపోతినో దేవా (3)
ప్రార్థనలో మొఱ్ఱపెట్ట – వింటివి నా దీనధ్వని (2)
అందుకే నే పాడెద – కీర్తించెద (1)
2. నా మీదికి లేచువారు – నన్ను బెదరించెడు వారు
దేవా నీ రక్షణ నా నుండి – దాటిపోయెననె వారు
ప్రార్థనలో మొఱ్ఱపెట్ట – వింటివి నా దీనధ్వని
అందుకే నే పాడెద – కీర్తించెద
3. నీవే నా కాపరి నంటివి – కాపుదలలో రాలేక యుంటిని
పాపినై యుండి పాపమెరుగనంటి – శాపగ్రస్తుడనైతి దేవా
ప్రార్థనలో మొఱ్ఱపెట్ట – వింటివి నా దీనధ్వని
అందుకే – నే పాడెద – కీర్తించెద
4. మూతవేసిన నా మూర్ఖతయును – దాగియుండిన నా పాపమును
విప్పిచూపి శిక్షింపనంటివి – కక్షలేని నా దేవా
అర్హతలేనివాడను – సర్వము పోయినవాడను
అందుకే నే పాడెద – కీర్తించెద
5. నేను నీ కట్టడలను – నేర్చుకొనునట్లును
శ్రమపొంది యుండుట నాకు – మేలని నేర్పించితివి
నీ ధర్మ శాస్త్రము నాకు ప్రియము – దినమెల్ల నేను
ధ్యానింతును అందుకే నే పాడెద – కీర్తించెద
6. పర్వతములు తొలగిపోయినను – తత్తరిల్లిన మెట్టలు మట్టమై
ఒట్టు పెట్టుకొని నేను చెప్పెద – విడచిపోదు నిన్ నాదు కృప
నీ వాగ్దానములకే నా స్తోత్రము – నా ఆర్త ధ్వనులు నా హృదయ ధ్యానం
అంగీకరించు దేవా – కీర్తించెద
7. నేను చేయునది ఇపుడు – నీవు ఎరుగజాలవనె
తెలిసికొందువు నీవు ఇక ముందుకు – నా పరిపూర్ణ మార్గమిదే
వింటిని నే నీ స్వరము – కంటిని నే నీ రూపము
హల్లెలూయ పాడెద – కీర్తించెద
English Lyrics / Transliteration
Pallavi:
Devaa! Nee Thalampulu Naa – Kentho Priyamu Entho Priyamu (2)
Vaatimoththamu Daasudanagune – Nenchi Cheppeda Goppadi Goppadi (2)
1. Paathaalapu Paashamulu – Nannu Arikattagaa (2)
Aavarinche Marana Urulu (2) – Krunggipothino Devaa (3)
Praarthanalo Morrapetta – Vintivi Naa Deenadhvani (2)
Anduke Ne Paadeda – Keerthincheda (1)
2. Naa Meediki Lechuvaaru – Nannu Bedarinchedu Vaaru
Devaa Nee Rakshana Naa Nundi – Daatipoyenane Vaaru
Praarthanalo Morrapetta – Vintivi Naa Deenadhvani
Anduke Ne Paadeda – Keerthincheda
3. Neeve Naa Kaapari Nantivi – Kaapudalalo Raaleka Yuntini
Paapinai Yundi Paapamerugananti – Shaapagrasthudanaithi Devaa
Praarthanalo Morrapetta – Vintivi Naa Deenadhvani
Anduke – Ne Paadeda – Keerthincheda
4. Moothavesina Naa Moorkhathayunu – Daagiyundina Naa Paapamunu
Vippichoopi Shikshimpanantivi – Kakshaleni Naa Devaa
Arhathalenivaadanu – Sarvamu Poyinavaadanu
Anduke Ne Paadeda – Keerthincheda
5. Nenu Nee Kattadalanu – Nerchukonunatlunu
Shramapondi Yunduta Naaku – Melani Nerpinchithivi
Nee Dharma Shaasthramu Naaku Priyamu – Dinamella Nenu
Dhyaaninthunu Anduke Ne Paadeda – Keerthincheda
6. Parvathamulu Tholagipoyinanu – Thaththarillina Mettalu Mattamai
Ottu Pettukoni Nenu Cheppeda – Vidachipodu Nin Naadu Krupa
Nee Vaagdaanamulake Naa Sthothramu – Naa Aartha Dhvanulu Naa Hrudaya Dhyaanan
Anggeekarinchu Devaa – Keerthincheda
7. Nenu Cheyunadi Ipudu – Neevu Erugajaalavane
Thelisikonduvu Neevu Ika Munduku – Naa Paripoorna Maargamide
Vintini Ne Nee Svaramu – Kantini Ne Nee Roopamu
Hallelooya Paadeda – Keerthincheda
Watch & Listen
Song History & Meaning
Composer / Hymnodist: Songs of Zion
God's thoughts toward us are infinitely precious and vast. No matter how deep our trials or fears may be, this song reminds us that He is a faithful Father who never ignores our cries. When the shadows of trouble loom or voices of discouragement surround us, the Lord bends down to hear our humble prayer and brings deliverance. Let us respond with grateful hearts, praising Him daily for His overwhelming love and constant care.
📖 Related Scripture Passages:
- Psalm 139:17: “How precious to me are your thoughts, God! How vast is the sum of them!”
- Psalm 116:3: “The cords of death surrounded me. The pains of Sheol caught hold of me. I found trouble and sorrow.”
- Psalm 116:1: “I love Yahweh, because he listens to my voice, and my cries for mercy.”