Telugu Lyrics
పల్లవి:
దేవుడు చేసిన పనియైయున్నాము (1)
క్రీస్తునందు ఆయన చేసిన పనియైయున్నాము (2)
1. ఆదాము నిబంధనను భంగము చేసిన –
దోషము వలన మరణ దాస్యములో నుండగా (2)
దేవుని కుమారుడు గొట్టెపిల్లయై (2)
ప్రాణమిచ్చి ప్రాయశ్చిత్తము చేసెను (1)
2. ఇశ్రాయేలు ఐగుప్తు దాస్యములో నుండి
నిట్టూర్పులతో మూలుగు లిడుచు మొఱ్ఱపెట్టగ
పరలోకము నుండి దిగివచ్చి దేవుడు
విడిపించి వారిని నడిపించెను
3. అపరాధములచే పాపములచే చచ్చిన వారమై
ఉగ్రత పాత్రులమై యుంటిమి
దేవుడు తన మహా ప్రేమ చేత
క్రీస్తుతో కూడ బ్రతికించెను
4. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి
రక్తము ద్వారా అపరాధములను క్షమియించెను
దేవుని చిత్తమయిన సంకల్పమును బట్టి
తన స్వాస్థ్యముగా ఏర్పరచెను
5. దూరస్థులైన మనల క్రీస్తుయేసు నందు
రక్తము వలన సమీపస్తులుగా చేసెను
మద్యపు గోడను పడగొట్టి మనల
ఇశ్రాయేలుతో ఏకము చేసెను
6. క్రీస్తుయేసు ముఖ్యమైన మూలరాయియై యుండగా
అపోస్తలులు ప్రవక్తల పునాదిపై
పరిశుద్ధాలయముగా దేవుని వాసముగా
ఆత్మమూలముగా కట్టబడుచున్నాము
7. దేవ నీవే మా కుమ్మరివి జిగటవంటి వారము మేము
నీ హస్తములతో నీ పోలికలో రూపునిచ్చి
మంటి ఘటములలో మహిమైశ్వర్యము నింపి
మహిమ నొందుచున్న దేవ సోత్రము
English Lyrics / Transliteration
Pallavi:
Devudu Chesina Paniyaiyunnaamu (1)
Kreesthunandu Aayana Chesina Paniyaiyunnaamu (2)
1. Aadaamu Nibandhananu Bhanggamu Chesina –
Doshamu Valana Marana Daasyamulo Nundagaa (2)
Devuni Kumaarudu Gottepillayai (2)
Praanamichchi Praayashchiththamu Chesenu (1)
2. Ishraayelu Aigupthu Daasyamulo Nundi
Nittoorpulatho Moolugu Liduchu Morrapettaga
Paralokamu Nundi Digivachchi Devudu
Vidipinchi Vaarini Nadipinchenu
3. Aparaadhamulache Paapamulache Chachchina Vaaramai
Ugratha Paathrulamai Yuntimi
Devudu Thana Mahaa Prema Chetha
Kreesthutho Kooda Brathikinchenu
4. Devuni Krupa Mahadaishvaryamunu Batti
Rakthamu Dvaaraa Aparaadhamulanu Kshamiyinchenu
Devuni Chiththamayina Sangkalpamunu Batti
Thana Svaasthyamugaa Erparachenu
5. Doorasthulaina Manala KreesthuYesu Nandu
Rakthamu Valana Sameepasthulugaa Chesenu
Madyapu Godanu Padagotti Manala
Ishraayelutho Ekamu Chesenu
6. KreesthuYesu Mukhyamaina Moolaraayiyai Yundagaa
Aposthalulu Pravakthala Punaadipai
Parishuddhalayamugaa Devuni Vaasamugaa
Aathmamoolamugaa Kattabaduchunnaamu
7. Deva Neeve Maa Kummarivi Jigatavanti Vaaramu Memu
Nee Hasthamulatho Nee Polikalo Roopunichchi
Manti Ghatamulalo Mahimaishvaryamu Nimpi
Mahima Nonduchunna Deva Sothramu
Song History & Meaning
Composer / Hymnodist: Songs of Zion
We are God’s precious handiwork, beautifully remade in Christ Jesus. Just as He heard the cries of His people in bondage and redeemed us from sin through the sacrifice of His Son, He intimately cares for us. Remembering His miraculous rescue invites us to rest in His unfailing love and yield our lives completely to the Heavenly Craftsman.
📖 Related Scripture Passages:
- Ephesians 2:10: “For we are his workmanship, created in Christ Jesus for good works, which God prepared before that we would walk in them.”
- Romans 5:8: “But God commends his own love toward us, in that while we were yet sinners, Christ died for us.”
- Hebrews 2:15: “and might deliver all of them who through fear of death were all their lifetime subject to bondage.”
Pingback: దేవుడు చూస్తున్నాడు – Devudu Choosthunnaadu Song Lyrics in Telugu & English | Chords & Meaning - Christian Songz