Telugu Lyrics
పల్లవి:
స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయ –
స్తుతి – చెల్లించి యుల్లసింతము హల్లెలూయ (2)
అను పల్లవి:
గడచిన కాలమెల్ల – కంటిపాపవలె (2)
కాచెను ప్రభువు మమ్ము హల్లెలూయ – ప్రభున్ (1)
1. పాపమును బాపినాడు హల్లెలూయ – మన
శాపమును మాపినాడు హల్లెలూయ (2)
కన్నతల్లి వలెనే – కనికరించెను మమ్ము (2)
యెన్నతరమా ప్రేమ హల్లెలూయ – ప్రభున్ (1)
2. తల్లియైన మరచినను హల్లెలూయ – తాను
ఎన్నడైన మరచిపోడు హల్లెలూయ
ఎల్ల యీవులనిచ్చి – యుల్లాస మొసగును
కొల్లగ మనల కోరి హల్లెలూయ – ప్రభున్
3. శోధన కాలములందు హల్లెలూయ – మన –
వేదన కాలములందు హల్లెలూయ
నాథుడు యేసు మన చెంతనుండ నిల
చింత లేమియు రావు హల్లెలూయ – ప్రభున్
4. ఘోర తుఫాను లెన్నెన్నో హల్లెలూయ – బహు –
ఘోరముగ లేచినను హల్లెలూయ
దోనెయందున్న యేసు – దివ్యముగను లేచి
ధాటిగా వాటి నణచు హల్లెలూయ ప్రభున్
5. సర్వలోకమునందున హల్లెలూయ – నన్ను –
సాక్షిగ నుంచెను యేసు హల్లెలూయ
చేరిన వారినెల్ల కోరి ప్రేమించు నేసు
చేర్చును కౌగిటిలో హల్లెలూయ – ప్రభున్
English Lyrics / Transliteration
Pallavi:
Sthothrinchi Keerthinchedamu Hallelooya –
Sthuthi – Chellinchi Yullasinthamu Hallelooya (2)
Anu Pallavi:
Gadachina Kaalamella – Kantipaapavale (2)
Kaachenu Prabhuvu Mammu Hallelooya – Prabhun (1)
1. Paapamunu Baapinaadu Hallelooya – Mana
Shaapamunu Maapinaadu Hallelooya (2)
Kannathalli Valene – Kanikarinchenu Mammu (2)
Yennatharamaa Prema Hallelooya – Prabhun (1)
2. Thalliyaina Marachinanu Hallelooya – Thaanu
Ennadaina Marachipodu Hallelooya
Ella Yeevulanichchi – Yullaasa Mosagunu
Kollaga Manala Kori Hallelooya – Prabhun
3. Shodhana Kaalamulandu Hallelooya – Mana –
Vedana Kaalamulandu Hallelooya
Naathudu Yesu Mana Chenthanunda Nila
Chintha Lemiyu Raavu Hallelooya – Prabhun
4. Ghora Thuphaanu Lennenno Hallelooya – Bahu –
Ghoramuga Lechinanu Hallelooya
Doneyandunna Yesu – Divyamuganu Lechi
Dhaatigaa Vaati Nanachu Hallelooya Prabhun
5. Sarvalokamunanduna Hallelooya – Nannu –
Saakshiga Nunchenu Yesu Hallelooya
Cherina Vaarinella Kori Preminchu Nesu
Cherchunu Kaugitilo Hallelooya – Prabhun
Watch & Listen
Song History & Meaning
Composer / Hymnodist: Songs of Zion
Reflecting on how God has protected us like the apple of His eye and cared for us like a loving mother fills our hearts with deep gratitude. He has cleansed our sins and removed our curses through His unfailing grace. This song gently invites us to look back at His faithfulness and respond with joyful praise. Let us sing Hallelujah with gladness, honoring the One whose love is truly beyond measure.
📖 Related Scripture Passages:
- Psalm 150:6: “Let everything that has breath praise Yahweh! Praise Yahweh!”
- Psalm 121:7: “Yahweh will keep you from all evil. He will keep your soul.”
- Galatians 3:13: “Christ redeemed us from the curse of the law, having become a curse for us. For it is written, “Cursed is everyone who hangs on a tree,””