Telugu Lyrics
పల్లవి:
యెడతెగక ప్రార్థించుము (2) – మెలకువతో కొనసాగుము (1)
యెడతెగక ప్రార్థించుము (1)
1. క్రీస్తుని ఉపదేశమును పొంది (2) – ఆయన మాదిరి మదియందుంచి (2)
ప్రార్థించుము – కౄతజ్ఞతతో (2) – ఆనంద గీతము పాడుచును (2)
2. ఆయన రాకడ సమీపము – అర్థరాత్రో కూడి కూయునపుడో
గమనిక లేనివానివలె నుండిన – యజమానుని శిక్షకు గురి యగుదువు
3. ఉగ్రత నుండి తప్పించు యేసు – ప్రత్యక్షమౌను పరమందుండి
ఉపద్రవమందు పొందిన రక్షణ – కాపాడుకొనన్ నీ ఆత్మయందు
4. మీరేగదా మాదు నిరీక్షణ – ఆనందమును అతిశయమని
ప్రేమతో ప్రయాస మొందునట్టి – దైవజనుల పోలి నడువంగను
5. విశ్వాసమందున్న లోపములను – సరిదిద్దుటకు కృపను పొంద
ప్రార్థించు సేవకుల ప్రేమను చూచి – వేదనతో వేడు శక్తిని పొంద
6. ప్రధానదూత శబ్దమును – దేవుని బూర ద్వనిని వినగా
క్రీస్తునందుండి మృతులైనవారు – లేతురు మొదట మనకన్న ముందు
7. నిద్రపోక భద్రముగా నుండ – భారముతో వేడుము ప్రభు శక్తిని
ఎత్తబడరు మత్తులైనవారు – మెలకువతో వేడు ఉజ్జీవాత్మకై
8. మీ ఆత్మజీవమును రాకడయందు – నిందారహిత సంపూర్ణతతో
సమాధాన కర్తన్ ప్రార్థించుము – కాపాడబడను పరిశుద్ధతలో
English Lyrics / Transliteration
Pallavi:
Yedathegaka Praarthinchumu (2) – Melakuvatho Konasaagumu (1)
Yedathegaka Praarthinchumu (1)
1. Kreesthuni Upadeshamunu Pondi (2) – Aayana Maadiri Madiyandunchi (2)
Praarthinchumu – Kroothagnathatho (2) – Aananda Geethamu Paaduchunu (2)
2. Aayana Raakada Sameepamu – Artharaathro Koodi Kooyunapudo
Gamanika Lenivaanivale Nundina – Yajamaanuni Shikshaku Guri Yaguduvu
3. Ugratha Nundi Thappinchu Yesu – Prathyakshamaunu Paramandundi
Upadravamandu Pondina Rakshana – Kaapaadukonan Nee Aathmayandu
4. Meeregadaa Maadu Nireekshana – Aanandamunu Athishayamani
Prematho Prayaasa Mondunatti – Daivajanula Poli Naduvangganu
5. Vishvaasamandunna Lopamulanu – Sarididdutaku Krupanu Ponda
Praarthinchu Sevakula Premanu Choochi – Vedanatho Vedu Shakthini Ponda
6. Pradhaanadootha Shabdamunu – Devuni Boora Dvanini Vinagaa
Kreesthunandundi Mruthulainavaaru – Lethuru Modata Manakanna Mundu
7. Nidrapoka Bhadramugaa Nunda – Bhaaramutho Vedumu Prabhu Shakthini
Eththabadaru Maththulainavaaru – Melakuvatho Vedu Ujjeevaathmakai
8. Mee Aathmajeevamunu Raakadayandu – Nindaarahitha Sampoornathatho
Samaadhaana Karthan Praarthinchumu – Kaapaadabadanu Parishuddhathalo
Watch & Listen
Song History & Meaning
Composer / Hymnodist: Songs of Zion
Prayer is the sacred connection that keeps our hearts constantly attuned to God's tender presence. Following the beautiful example of Jesus, this song gently invites us to remain watchful and filled with thanksgiving in every season of life. As we navigate trials and eagerly await His return, unceasing prayer protects our spirits and grounds our hope in Him.
📖 Related Scripture Passages:
- 1 Thessalonians 5:17: “pray without ceasing.”
- Matthew 24:42: “Watch therefore, for you don’t know in what hour your Lord comes.”
- Romans 12:12: “rejoicing in hope; enduring in trouble; continuing steadfastly in prayer;”