Telugu Lyrics
పల్లవి:
యెహోవా సేవకులారా స్తుతించుడి – ఆయన నామమును స్తుతించుడి (1)
అను పల్లవి:
యెహోవా మందిర ఆవరణములలో (2)
నిలుచుండు వారలారా మీరు (1)
1. యెహోవా దయాళుడు ఆయన నామమును – కీర్తించుడి అది మనోహరము (1)
యాకోబును తనకొర కేర్పరచుకొని (2)
ఇశ్రాయేలును స్వకీయ ధనముగా కొనెన్ (1)
2. యెహోవా సకల దేవతల కంటెను – గొప్పవాడని నేనెరుంగుదున్
భూమ్యాకాశములు మహా
సముద్రము – లందాయన కిష్టమైనవి చేసెను
3. భూమి దిగంతముల నుండి ఆవిరి – లేవజేసి వాన కురియునట్లు
మెరుపును పుట్టించి తన నిధులలో నుండి
గాలిని బయలు వెళ్ళఁజేయు వాడాయనే
4. ఐగుప్తు జనుల తొలిచూలులను – పశువుల తొలిచూలుల జంపెను
ఫరో యెదుట వాని ఉద్యోగుల యెదుట
సూచనల మహాత్కార్యముల జేసె
5. అన్యులనేకులను శక్తిగల – రాజులనేకులను చంపెను
అమోరీయుల రాజైన సీహోనును
బాషాను రాజగు ఓగును చంపెను
6. కనాను రాజ్యముల పాడుచేసియు – నిశ్రాయేలేయుల కప్పగించెను
యెహోవా నీ నామము నిత్యముండున్
నీ జ్ఞాపకార్థము తర తరములకును
7. యెహోవా తనదగు ప్రజలకు తానే – న్యాయము తీర్చును హల్లెలూయ
తన వారగు తన సేవకులను బట్టి
సంతాపము నొందు నాయనల్లేలూయ
English Lyrics / Transliteration
Pallavi:
Yehovaa Sevakulaaraa Sthuthinchudi – Aayana Naamamunu Sthuthinchudi (1)
Anu Pallavi:
Yehovaa Mandira Aavaranamulalo (2)
Niluchundu Vaaralaaraa Meeru (1)
1. Yehovaa Dayaaludu Aayana Naamamunu – Keerthinchudi Adi Manoharamu (1)
Yaakobunu Thanakora Kerparachukoni (2)
Ishraayelunu Svakeeya Dhanamugaa Konen (1)
2. Yehovaa Sakala Devathala Kantenu – Goppavaadani Nenerunggudun
Bhoomyaakaashamulu Mahaa
Samudramu – Landaayana Kishtamainavi Chesenu
3. Bhoomi Diganthamula Nundi Aaviri – Levajesi Vaana Kuriyunatlu
Merupunu Puttinchi Thana Nidhulalo Nundi
Gaalini Bayalu Vellanjeyu Vaadaayane
4. Aigupthu Janula Tholichoolulanu – Pashuvula Tholichoolula Jampenu
Pharo Yeduta Vaani Udyogula Yeduta
Soochanala Mahaathkaaryamula Jese
5. Anyulanekulanu Shakthigala – Raajulanekulanu Champenu
Amoreeyula Raajaina Seehonunu
Baashaanu Raajagu Ogunu Champenu
6. Kanaanu Raajyamula Paaduchesiyu – Nishraayeleyula Kappaginchenu
Yehovaa Nee Naamamu Nithyamundun
Nee Gnaapakaarthamu Thara Tharamulakunu
7. Yehovaa Thanadagu Prajalaku Thaane – Nyaayamu Theerchunu Hallelooya
Thana Vaaragu Thana Sevakulanu Batti
Santhaapamu Nondu Naayanallelooya
Watch & Listen
Song History & Meaning
Composer / Hymnodist: Songs of Zion
This song warmly invites all servants of God to step into His presence and lift up praise to His beautiful name. When we remember that God is inherently good and that He has chosen us as His treasured possession, our hearts naturally overflow with gratitude. He is far greater than anything this world has to offer. Today, let us stand with joyful hearts, declaring the majesty and lovingkindness of our God.
📖 Related Scripture Passages:
- Psalm 135:1: “Praise Yah! Praise Yahweh’s name! Praise him, you servants of Yahweh,”
- Psalm 135:2: “You who stand in the house of Yahweh, In the courts of our God’s house.”
- Psalm 135:4: “For Yah has chosen Jacob for himself; Israel for his own possession.”