🎵 Song Lyrics in Telugu Script (తెలుగు లిరిక్స్)
పల్లవి:
అన్ని కాలంబుల యెహోవాను నే – నెన్నెదన్ దయాలయుడా కన్నతండ్రి
వన్నెకెక్కిన మోక్షవాసి సన్నుతు – లున్నతమై యుండ మ్రోయును నీకు ॥అన్ని॥
చరణములు:
1.
నిన్ను ప్రకటించగా నిఖిల లోకములను – పన్నుగా జేసిన బలుడ వీవె
ఉన్న లోకంబుల నుడుగక కరుణా సం–పన్నతతో నేలు ప్రభుడ వీవె
అన్ని జీవుల నెరిగి యాహార మిచ్చుచు – నున్న సర్వజ్ఞుండవైన నీవె
ఎన్న శక్యముగాక యున్న లక్షణముల – సన్నుతించుటకు నే జాలుదునా ॥అన్ని॥
2.
పుట్టించ నీవంచు పోషించ నీవంచు – గిట్టించ నీవంచు నెరిగింతును
నట్టి పనికి మాలినట్టి మానవుల జే–పట్టి రక్షించ బాధ్యుండవంచు
దట్టమైన కృపను దరిజేర్చ నాకిచ్చి – పట్టరై నిలచియుండు ప్రభుడ వంచు
గట్టడచే గడ ముట్టెదననుక నా – పట్టుకొలది నిన్ను ప్రస్తుతింతు ॥అన్ని॥
3.
కారుణ్యనిధి వీవు కఠినాత్ముడను నేను – భూరి శుద్ధుడ వీవు పాపి నేను
సార భాగ్యుడ వీవు జగతిలో నాకన్న – దారిద్రుడే లేడు తరచి చూడ
సార సద్గుణముల సంపన్నుడవు నీవు – ఘోర దుర్గుణ సంచారి నేను
ఏ రీతి స్తుతియింతు నే రీతి సేవింతు – నేర మెన్నక ప్రోవ నెర నమ్మితి ॥అన్ని॥
🔤 Song Lyrics in English Transliteration
Pallavi:
Anni Kaalambula Yehovaanu Ne – Nennedhan Dayaalayudaa Kanna Thandri
Vannekekkina Mokshavaasi Sannuthu – Lunnathamai Yunda Mroyunu Neeku ||Anni||
Charanam 1:
Ninnu Prakatinchagaa Nikhila Lokamulanu – Pannugaa Jesina Baluda Veeve
Unna Lokambula Nudugaka Karunaa Sam–pannathatho Naelu Prabhuda Veeve
Anni Jeevula Nerigi Yaahaara Michhuchu – Nunna Sarvajnundavaina Neeve
Enna Shakyamugaaka Yunna Lakshanamula – Sannuthinchutaku Ne Jaaludhunaa ||Anni||
Charanam 2:
Puttincha Neevanchu Poshincha Neevanchu – Gittincha Neevanchu Neriginthunu
Natti Paniki Maalinatti Maanavula Jae–patti Rakshincha Baadhyundavanchu
Dattamaina Krupanu Dharijaercha Naakichhi – Pattarai Nilachiyundu Prabhuda Vanchu
Gattadache Gada Muttedhananuka Naa – Pattukoladhi Ninnu Prasthuthinthu ||Anni||
Charanam 3:
Kaarunyanidhi Veevu Kathinaathmundanu Naenu – Bhoori Shuddhuda Veevu Paapi Naenu
Saara Bhaagyuda Veevu Jagathilo Naakanna – Dhaaridhrudae Laedu Tharachi Chooda
Saara Sadgunamula Sampannudavu Neevu – Ghora Dhurguna Sanchaari Naenu
Ae Reethi Sthuthiyinthu Nae Reethi Saevinthu – Naera Mennaka Prova Nera Nammithi ||Anni||
🎸 Guitar & Keyboard Chords
Key: D Major | Time Signature: 4/4 | Capo: None
[Intro]
D - G - A - D
[Pallavi]
[D] [G] [A]
Anni Kaalambula Yehovaanu Ne Nennedhan
[G] [A] [D]
Dayaalayudaa Kanna Thandri Mokshavaasi
[D] [G] [A] [D]
Sannuthulunnathamai Yunda Mroyunu Neeku (Anni)
[Charanam]
[D] [G] [D]
Ninnu Prakatinchagaa Nikhila Lokamulanu
[G] [A] [D]
Pannugaa Jesina Baluda Veeve Prabhuva
[D] [G] [A]
Anni Jeevula Nerigi Yaahaara Michhuchu
[G] [A] [D]
Sarvajnundavaina Ninnu Sannuthiyinthu (Anni)
“`
📖 Meaning & Spiritual Message
Telugu Bhavaartham (భావార్థం):
ఈ కీర్తన ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో మొట్టమొదటి కీర్తనగా నిలిచింది. దేవుని సృష్టి సామర్థ్యాన్ని, సమస్త జీవులను పోషించే ఆయన సర్వజ్ఞత్వాన్ని బేతాళ జాన్ గారు అద్భుతంగా స్తుతించారు. మూడవ చరణంలో తన పాపస్థితిని, దేవుని అపారమైన కారుణ్యాన్ని పోల్చుతూ, వినయపూర్వకమైన హృదయంతో దేవుని సన్నిధిలో ప్రార్థించడం ఈ కీర్తనలోని ప్రధాన ఆధ్యాత్మిక సత్యం.
English Meaning:
Keerthana #1 stands as the opening anthem of the Andhra Kraisthava Keerthanalu. Composed by Bethala John, it expresses continuous praise to God the Father in all seasons of life. It acknowledges God as the sovereign Creator, Sustainer of all living beings, and the God of infinite mercy who accepts and redeems fallen sinners.
🎥 Watch & Listen (ఆడియో & వీడియో గీతం)