ఎంతో శృంగారమైనది – Entho Shrunggaaramainadi Song Lyrics in Telugu & English | Chords & Meaning

Telugu Lyrics

ఎంతో శృంగార మైనది – యేసుని చరిత – మిది యెంతో వేడ్కై యున్నది
– మోక్ష ప్రవేశ = మంతటం దేజో – వంతుండు క్రీస్తుండు – చెంతను దూతా
– శ్రితజన పజ్జులు – వింతగ నుడువంగ – సంతత నవ్య వ – సంతము
గల్గియ – నంతజీవ రస – వంతఫలోప వ – నాంతర ములు ద – త్రావ్యంత
బునగల – పరమపురమునకు = సంతసమున జనె – జయశబ్దముతో ||ఎంతో||

1. తెరచి మూయంగ రానట్టి – ద్వారములారా మీ – శిరము లెత్తుకొని యుండు
డి – యనాదిగ నుండు – వర క వాటములారా మీరే – యెత్తంగం బడుండీ
= సురచిన మహిమ – స్ఫురణలుగల మీ – దొరతన పరిశు-ద్ధుల కరు
లగు భీ – కర దురితాత్ముల దురమునం జిదిపి య-పరిమిత బల జయ
– బిరుదాంకితు దై – చిరముగ నూతన – యెరుసలేమ పుర – పరి
పాలనం ద – త్పరుండై యిదిగో నెరవుగ వచ్చెను – నిజ భక్తులతో ||ఎంతో||

2. సుందర మందానిలమందు-జీవ సంజీవా-నందసౌఖ్య ప్రదమై యుండ
– రేబగ లంటని – మందిర వాసులప్పుడు – జయజయశబ్దములం = బొందుగం
గ్రీస్తుని – పొగడుచుం బాడుచు – నందఱు పరమా – నందంబునం జె –
న్నొంది తనందరి – కిందగు రాజుగ – వందనములు తగ – వరుస నొనర్చుచు
– నందముగా ప్రభుం – జెందిన భక్తుల-బృందములకుం దగు – విందు
లొనర్చిరి = పొందిక కలిగెను – భూమికి ముక్తికి ||ఎంతో||

3. ములపైం బెట్టి-కళ లీను ధవళ వస్త్రములు-గట్టంగ నిచ్చి = చెలువుగ
మరి వా -రల చేతుల లో- పల విజయార్ధపు – బర్ణము లొసంగి స- కల
దూతలు భ – క్తులతో గూడి వి – మల పీఠము ముం -గల నిలువంబడి –
పాలువగం దమ దే – వునకును గ్రీస్తున – కెలమిని స్తోత్రము – బలఘన
మనిశము = కలుగును గాకని – పలికి నుతించిరి ||ఎంతో||

4. పరిశుద్ధవంతు లప్పుడు – శాశ్వతానంద – భరితులై వీణెలు ధరియించి –
పాటులు బాడుచును – గురురాయండైన తమ ప్రభుని – గుణములు వర్ణించి
= కరుణను నీ ర – క్తముచే మము నం – దటి ధరణింగల – నరవంశస్థుల
– తరములలో నుం – డరుదుగ దేవుని – కొఱకుంగదా మముం – గొనియుంటిని
యని – మురువుగ నింక దే – వుని – కొఱకుంగదా మముం – గొని
యుంటిని యని – మురువుగ నింక దే – వుని సముఖంబున – దొరలను
నర్చుక వరులం జేసితివి = ధర నేలుదు మింక – సరియని మ్రొక్కిరి ||ఎంతో||


English Lyrics / Transliteration

Entho Shrunggaara Mainadi – Yesuni Charitha – Midi Yentho Vedkai Yunnadi
– Moksha Pravesha = Manthatan Dejo – Vanthundu Kreesthundu – Chenthanu Doothaa
– Shrithajana Pajjulu – Vinthaga Nuduvangga – Santhatha Navya Va – Santhamu
Galgiya – Nanthajeeva Rasa – Vanthaphalopa Va – Naanthara Mulu Da – Thraavyantha
Bunagala – Paramapuramunaku = Santhasamuna Jane – Jayashabdamutho ||Entho||

1. Therachi Mooyangga Raanatti – Dvaaramulaaraa Mee – Shiramu Leththukoni Yundu
Di – Yanaadiga Nundu – Vara Ka Vaatamulaaraa Meere – Yeththanggan Badundee
= Surachina Mahima – Sphuranalugala Mee – Dorathana Parishu-Ddhula Karu
Lagu Bhee – Kara Durithaathmula Duramunan Jidipi Ya-Parimitha Bala Jaya
– Birudaamkithu Dai – Chiramuga Noothana – Yerusalema Pura – Pari
Paalanan Da – Thparundai Yidigo Neravuga Vachchenu – Nija Bhakthulatho ||Entho||

2. Sundara Mandaanilamandu-Jeeva Sanjeevaa-Nandasaukhya Pradamai Yunda
– Rebaga Lantani – Mandira Vaasulappudu – Jayajayashabdamulan = Bondugan
Greesthuni – Pogaduchun Baaduchu – Nandaru Paramaa – Nandambunan Je –
Nnondi Thanandari – Kindagu Raajuga – Vandanamulu Thaga – Varusa Nonarchuchu
– Nandamugaa Prabhun – Jendina Bhakthula-Brundamulakum Dagu – Vindu
Lonarchiri = Pondika Kaligenu – Bhoomiki Mukthiki ||Entho||

3. Mulapaim Betti-Kala Leenu Dhavala Vasthramulu-Gattanga Nichchi = Cheluvuga
Mari Vaa -Rala Chethula Lo- Pala Vijayaardhapu – Barnamu Losanggi Sa- Kala
Doothalu Bha – Kthulatho Goodi Vi – Mala Peethamu Mun -Gala Niluvambadi –
Paaluvagam Dama De – Vunakunu Greesthuna – Kelamini Sthothramu – Balaghana
Manishamu = Kalugunu Gaakani – Paliki Nuthinchiri ||Entho||

4. Parishuddhavanthu Lappudu – Shaashvathaananda – Bharithulai Veenelu Dhariyinchi –
Paatulu Baaduchunu – Gururaayandaina Thama Prabhuni – Gunamulu Varninchi
= Karunanu Nee Ra – Kthamuche Mamu Nan – Dati Dharaninggala – Naravanshasthula
– Tharamulalo Nun – Daruduga Devuni – Korakungadaa Mamun – Goniyuntini
Yani – Muruvuga Ningka De – Vuni – Korakungadaa Mamun – Goni
Yuntini Yani – Muruvuga Ningka De – Vuni Samukhambuna – Doralanu
Narchuka Varulan Jesithivi = Dhara Neludu Mingka – Sariyani Mrokkiri ||Entho||


Song History & Meaning

Composer / Hymnodist: Purushoththamu Chaudhari

The glorious story of Jesus Christ and the breathtaking beauty of the Heavenly City He has prepared for us fill our hearts with profound hope. This hymn invites us to lift our heads and welcome the King of Glory, who has triumphed over sin and death. We are promised an eternity of joy, peace, and sweet fellowship in His presence. Even amidst life's present struggles, may we rejoice in the glorious future that awaits us in Him.

📖 Related Scripture Passages:

  • Psalm 24:7: “Lift up your heads, you gates; be lifted up, you everlasting doors, and the King of glory will come in.”
  • Revelation 21:2: “I saw the holy city, New Jerusalem, coming down out of heaven from God, made ready as a bride adorned for her husband.”
  • John 14:3: “If I go and prepare a place for you, I will come again, and will receive you to myself; that where I am, you may be there also.”

⭐ Verified Preferred Worship Source


Leave a Reply