మన బలమైన యాకోబు దేవునికి – Mana Balamaina Yaakobu Devuniki Song Lyrics in Telugu & English | Chords & Meaning

Telugu Lyrics

పల్లవి:
మన బలమైన యాకోబు దేవునికి (2) – గానము సంతోషముగా పాడుడీ (2)

అను పల్లవి:
పాటలు పాడి గిలక తప్పెట కొట్టుడి – సితార స్వరమండలము వాయించుడి (2)

1. అమావాస్య పున్నమ పండుగ దినములందు (2)
కొమ్మునూదుడి యుత్సాహముతోడ (2)
యాకోబు దేవుడు నిర్ణయించిన – ఇశ్రాయేలీయుల కది కట్టడ (2)

2. తానైగుప్తులో తిరిగినప్పుడు – యోసేపు సంతతికి సాక్షముగ
నిర్ణయించెను దేవుడు అచ్చట – నే నెరుగని భాషను నే వింటిని

3. తమభుజము నుండి బరువు దింపగ – మోతగంపల భారము దప్పెను
నీవాపదయందు మొఱపెట్టగా – విడిపించిన యెహోవాను నేనే

4. ఉరుము దాగుచోటులో నుండినే – ఉత్తరమిచ్చి నిన్ను శోధించితిని
మెరీబా జలముల యొద్ద నిన్ను – నా ప్రజలారా నా మాట వినుడి

5. ఇగుప్తు దేశములో నుండి నిన్ను – రప్పించిన యెహోవా దేవుడను
నీవు నీ నోరు బాగుగా తెరువుము – నేను నింపెదను మంచి వాటితో

6. అతి శ్రేష్ఠమైన గోధుమలను – అనుగ్రహించి పోషించెద నిన్ను
కొండ తేనెనిచ్చి కడు ప్రేమతో – తృప్తి పరచెదను నిత్యముగా

7. అయ్యో ఇశ్రాయేలు నీవు నా మాట – వినిన పక్షాన ఎంత మేలగు
అన్యదేవతల నెవ్వరికిని – నీవు ఎన్నడు పూజ చేయరాదు


English Lyrics / Transliteration

Pallavi:
Mana Balamaina Yaakobu Devuniki (2) – Gaanamu Santhoshamugaa Paadudee (2)

Anu Pallavi:
Paatalu Paadi Gilaka Thappeta Kottudi – Sithaara Svaramandalamu Vaayinchudi (2)

1. Amaavaasya Punnama Panduga Dinamulandu (2)
Kommunoodudi Yuthsaahamuthoda (2)
Yaakobu Devudu Nirnayinchina – Ishraayeleeyula Kadi Kattada (2)

2. Thaanaigupthulo Thiriginappudu – Yosepu Santhathiki Saakshamuga
Nirnayinchenu Devudu Achchata – Ne Nerugani Bhaashanu Ne Vintini

3. Thamabhujamu Nundi Baruvu Dimpaga – Mothagampala Bhaaramu Dappenu
Neevaapadayandu Morapettagaa – Vidipinchina Yehovaanu Nene

4. Urumu Daaguchotulo Nundine – Uththaramichchi Ninnu Shodhinchithini
Mereebaa Jalamula Yodda Ninnu – Naa Prajalaaraa Naa Maata Vinudi

5. Igupthu Deshamulo Nundi Ninnu – Rappinchina Yehovaa Devudanu
Neevu Nee Noru Baagugaa Theruvumu – Nenu Nimpedanu Manchi Vaatitho

6. Athi Shreshthamaina Godhumalanu – Anugrahinchi Poshincheda Ninnu
Konda Thenenichchi Kadu Prematho – Thrupthi Parachedanu Nithyamugaa

7. Ayyo Ishraayelu Neevu Naa Maata – Vinina Pakshaana Entha Melagu
Anyadevathala Nevvarikini – Neevu Ennadu Pooja Cheyaraadu


Watch & Listen


Song History & Meaning

Composer / Hymnodist: Songs of Zion

The God of Jacob is our refuge and our eternal strength. This joyful hymn invites us to lift our voices and instruments with glad hearts, celebrating the Lord's mighty acts and faithful decrees throughout our lives. As we remember how He has sustained us, our worship becomes a vibrant testimony of His goodness. Today, let us freely offer our praise to the One who renews our strength every day.

📖 Related Scripture Passages:

  • Psalm 81:1: “Sing aloud to God, our strength! Make a joyful shout to the God of Jacob!”
  • Psalm 81:3: “Blow the trumpet in the New Moon, at the full moon, on our feast day.”
  • Psalm 81:4: “For it is a statute for Israel, an ordinance of the God of Jacob.”

⭐ Verified Preferred Worship Source


Leave a Reply