Yesu Nayakuda Ellavelala

Lyrics in Telugu

పల్లవి:

యేసు నాయకుడా – యెల్ల వేళలను నీ – దాసుల నేలుమయ్యా
మోసములన్నిటి – మునగద్రోతునని – బాసలు జేసిన – ప్రభుడవు నీవెగా ॥యేసు॥

చరణములు:

1. రేయింబవలు మా – న్యాయము చెరిపెడి – మాయ పిశాచిని – ద్రోయుమి దూరము
బాయక భక్తుల – చేయి విడువని – బహుశ్రేష్ఠుడ నీవెగా ॥యేసు॥

2. హృదయము లోకము – మది పాపము మమ్ము – సతతము శ్రమ పెట్టును
సదయుడ మమ్మును – వదలకు నిత్యము – మది తలపులలో – మహిమగ నేలుమీ ॥యేసు॥

3. కాపాడుమి మమ్ము – మాపు రేపు నీ – శ్రీ పాదములొద్దను
ఏ పాపములును – ఏలకుండగ నీ – ప్రాపున బెంచుము – మాపాలకుడవో ॥యేసు॥

4. మా కొరకై నీ – మేనును మ్రానున – మేకులతో గొట్టగ
మానము మహిమలు – మనుజుల కియ్యను – భానుడ రాగై – బ్రతికి లేచితివి ॥యేసు॥

5. చెయెను చెయెనుగా – మరి పట్టుక నీవు – పరమున కేగితివే
వరముల నిడివిది – ధరలో నరులకు – పరముడ నీ దయ – మరువ శక్యమా ॥యేసు॥


🔤 Yesu Nayakuda Ellavelala Song Lyrics in English


Yesu Naayakudaa – Yella Velalanu Nee – Daasula Naelumayyaa
Mosamulanniti – Munagadrothunani – Baasalu Jesina – Prabhudavu Neevegaa ||Yesu||

1. Reyimbavalu Maa – Nyaayamu Cheripedi – Maaya Pishaachini – Droyumi Dooramu
Baayaka Bhakthula – Cheyi Viduvani – Bahu Shreshtuda Neevegaa ||Yesu||

2. Hrudhayamu Lokamu – Madhi Paapamu Mammu – Sathathamu Shrama Pettunu
Sadhayuda Mammunu – Vadhalaku Nithyamu – Madhi Thalapulalo – Mahimaga Naelumee ||Yesu||

3.Kaapaadumi Mammu – Maapu Repu Nee – Shree Paadhamuloddhanu
Ae Paapamulunu – Aelakundaga Nee – Praapuna Benchumu – Maapaalukudavo ||Yesu||

4.Maa Korakai Nee – Maenunu Mraanuna – Maekulatho Gottaga
Maanamu Mahimalu – Manujula Kiyyanu – Bhaanuda Raagai – Brathiki Laechithivi ||Yesu||

Charanam 5:
Cheyenu Cheyenugaa – Mari Pattuka Neevu – Paramuna Kaegithivae
Varamula Nidividhi – Dharalo Narulaku – Paramuda Nee Daya – Maruva Shakayamaa ||Yesu||

Hymn No. 3. Yesu naayakuda // 3వ కీర్తన, యేసు నాయకుడా

🎸 Guitar & Keyboard Chords

Key: E Minor | Time Signature: 4/4 | Capo: None

[Intro]
Em - D - C - Bm - Em

[Pallavi]
[Em] [D] [Em]
Yesu Naayakudaa Yella Velalanu Nee
[C] [D] [Em]
Daasula Naelumayyaa Deva
[Em] [D] [Em]
Mosamulanniti Munagadrothunani
[C] [D] [Em]
Baasalu Jesina Prabhudavu Neevegaa (Yesu)

[Charanam]
[Em] [D] [Em]
Reyimbavalu Maa Nyaayamu Cheripedi
[C] [D] [Em]
Maaya Pishaachini Droyumi Dooramu
[Em] [D] [Em]
Baayaka Bhakthula Cheyi Viduvani
[C] [D] [Em]
Bahu Shreshtuda Neevegaa (Yesu)

📖 Meaning & Spiritual Message


గొల్లపల్లి నతానియేలు గారు రచించిన ఈ ప్రార్థనా కీర్తన, విశ్వాసి తన అనుదిన పోరాటాలలో యేసుక్రీస్తు యొక్క నాయకత్వాన్ని, సంరక్షణను కోరే హృదయపూర్వక విన్నపం. సాతాను శోధనలను, లోక పాపపు ఆకర్షణలను జయించడానికి దేవుని దయ ఎంత అవసరమో ఈ కీర్తన స్పష్టంగా తెలియజేస్తుంది. క్రీస్తు శిలువ మరణం, పునరుత్థానం ద్వారా మానవాళికి లభించిన రక్షణ మరియు నిత్యజీవమును ఇందులో స్తుతించారు.

English Meaning:
Keerthana #3, composed by Gollapalli Nathaniyel, is a prayer hymn pleading for Christ’s continuous protection and leadership over His servants. It addresses spiritual warfare against temptation, acknowledges the frailty of the human heart, and rejoices in the resurrection of Jesus Christ who triumphed over death and ascended to heaven to pour out spiritual blessings on His people.

Leave a Reply